Palakurti: నల్గొండ బహిరంగ సభను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరణ

Palakurti: నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ బొమ్మెర గ్రామంలో కరపత్రం ఆవిష్కరించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 14 Nov 2026 6:03 PM IST
Palakurti
X

Palakurti: నల్గొండ బహిరంగ సభను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరణ

పాలకుర్తి: ఈనెల 15 నుంచి 18 తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని ఈనెల 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు సోమసత్యం పిలుపునిచ్చారు. శనివారం పాలకుర్తి మండల కేంద్రంలోని బొమ్మ ర గ్రామంలోప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాసభల కరపత్రం ఆవిష్కరించడం జరింగింది.

ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ రైతాంగ హక్కుల సాధన వ్యవసాయ రంగం పరిరక్షణ కోసం ఏఐకేఎస్ నిరంతరం పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు సాగిన చారిత్రక రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని, కరువు ప్రాంతాల్లో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలు లేకుండా దిగుమతికి అవకాశం ఇచ్చి దేశ రైతులను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. సాదా బైనామ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కౌలు రైతులను గుర్తించాలని కోరారు.

ఈనెల 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో మానుపాటి నరసయ్య, రాసాల యాకయ్య, బాదిగల పోతన, మానుపాటి రాములు, వంగాల యాకయ్య, ఒగ్గుల కొమరయ్య, బొంకూరి ప్రశాంత్, గాదరి ప్రశాంతు, జనగాం వీరసోముల, నీరటి అంజయ్య, బరిగల సోమయ్య, ఉప్పలయ్య, బొలోజు రాము, ఒగ్గుల పోతన, బొమ్మిశెట్టి సోమల్లు, జున్ను ఉప్పలయ్య, గొట్టిపర్తి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI