Devarakonda: శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో జాలే నరసింహారెడ్డి!

Devarakonda: దేవరకొండ మండలం జిల్లాపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 29 Nov 2026 4:07 PM IST
Devarakonda
X

Devarakonda: శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో జాలే నరసింహారెడ్డి!

దేవరకొండ: దేవరకొండ మండలంలోని జిల్లాపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు నిర్వహించిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మన ప్రియతమ నాయకులు జాలే నరసింహారెడ్డి PACS చైర్మన్.

ఈ సందర్భంగా నరసింహారెడ్డి గారు.. దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖాసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని అమ్మ వారిని మనస్పూర్తిగా ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి గారిని శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఆలయ నిర్మాణ దాత దేప శైలాంధర్ రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటయ్య, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ఉప సర్పంచ్ ధనరాజ్, హనుమంత్ రెడ్డి, సెక్రటరీ వెంకటయ్య, రాజవర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దీపేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకులు, శ్రీను, ఆఫ్రోజు, గొట్టే వెంకటయ్య, నీరుకంటి వెంకటయ్య, రమేష్, కొండల్, మరియు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA