Shaligouraram: చిత్తలూరులో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి

Shaligouraram: చిత్తలూరులో రూ.16 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కరపత్రాలు ఆవిష్కరించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 13 Nov 2026 5:33 PM IST
Shaligouraram
X

Shaligouraram: చిత్తలూరులో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి

శాలిగౌరారం: శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ప్రాథమిక ఉప కేంద్రంను నిర్మించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అధికారుల నిదర్శనమనీ జిల్లా కార్యదర్శి సాగర్, డివిజన్ నాయకులు సిలువేరు జానయ్య లు అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఈనెల 17నిర్వహించే MLA క్యాంపు కార్యాలయం ముట్టడికి సంబందించిన కరపత్రాలు చిత్తలూరు గ్రామంలో ఆవిష్కరణ చేశారు.

ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. సుమారు రూ. 16 లక్షల ప్రజాధనంతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటం విచారకరమనీ, గ్రామంలో సుమారు 3 వేల మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ అత్యవసర వైద్య సేవల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

పాము, తేలు, కుక్కలు, కోతులు కరిచినప్పుడు, ఇతర అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోందని, ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభమైతే ప్రాథమిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు, అత్యవసర చికిత్స సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల ఆరోగ్య హక్కును నిర్లక్ష్యం చేస్తూ నిర్మించిన భవనాన్ని నిరుపయోగంగా ఉంచడం సమంజసం కాదని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆరోగ్య ఉపకేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని,

లేనిపక్షంలో ఈ నెల 17వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేస్తామని, ఈ ఆందోళనకు చిత్తలూరు గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ కే యం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల శంకర్, పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు సిలివేరు సునీత, తుడి శ్రీశైలం, ఇంద్రకoటీ శంబయ్య, బోడ శంబయ్య, గిరగాని యాదగిరి, రాజయ్య, వెంకన్న, గాదగాని అండాలు, నీలమ్మ, గుగ్గిళ్ల వెంకటయ్య, యాదగిరి, మరిపెల్లి వీరయ్య, శింత్తలూరు శంకర్, డేగల యల్లమ్మ, తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు...

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL