Suryapet: మఠంపల్లి ప్రజావాణికి అధికారుల గైర్హాజరు.. గంటల తరబడి ప్రజల ఎదురుచూపులు!
Suryapet: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు సమయానికి హాజరుకాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Suryapet: మఠంపల్లి ప్రజావాణికి అధికారుల గైర్హాజరు.. గంటల తరబడి ప్రజల ఎదురుచూపులు!
Suryapet: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మండలంలో ఉన్న వివిధ శాఖల అధికారుల గైర్హాజరు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఈరోజు మఠంపల్లి మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారు మాత్రమే హాజరయ్యారని, ఉదయం 11:15 గంటలు దాటుతున్నప్పటికీ మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు ఇంకా హాజరుకాకపోవడంతో తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశతో వివిధ గ్రామాల నుంచి ప్రజలు మండల కేంద్రానికి వస్తున్నారు. అయితే, సంబంధిత శాఖల అధికారులు సమయానికి హాజరుకాకపోతే ప్రజలు తమ సమస్యలను ఎవరికి వివరించాలి? వాటికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.




