Suryapet: హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంగ్లాండ్ NRI మహిళ ప్రసవం!
Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన NRI మహిళ నిహారికకు సుఖప్రసవం. పరామర్శించిన డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, వైద్య బృందం.
Suryapet: హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంగ్లాండ్ NRI మహిళ ప్రసవం!
Suryapet: హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో NRI మహిళ సుఖప్రసవం చేసి ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకాన్ని నిలబెట్టింది. ఇంగ్లాండ్ నుండి వచ్చిన శ్రీమతి నిహారిక రెండవ కాన్పు కోసం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించగా, వైద్యులు సురక్షితంగా సుఖప్రసవం చేశారు.
ఈ సందర్భంగా DMHO డా. పెండెం వెంకట రమణ, DCHS డా. ఎస్. వెంకటేశ్వర్లు, GMC సూర్యాపేట పీడియాట్రిక్ విభాగం HOD ప్రొఫెసర్ డా. జార్జ్ లు తల్లీబిడ్డను పరామర్శించారు.
విదేశాలలో ఉన్నత ప్రమాణాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, మన ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో ఇంగ్లాండ్ నుండి వచ్చి ఇక్కడ ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన సేవలకు ఇది నిదర్శనమని అన్నారు.
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఇదే స్ఫూర్తితో మరింత మంచి సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం తల్లి, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలింతకు ఆరోగ్య బోధన చేశారు.




