Nalgonda: ఓటర్ల సవరణలో నిర్లక్ష్యం వద్దు: కమిషనర్ దేవసేన

Nalgonda: నల్గొండ జిల్లా మునుగోడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల పరిశీలకురాలు శ్రీదేవసేన తనిఖీ చేసి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

Saleem, Nalgonda
Published on: 27 Oct 2026 4:40 PM IST
Nalgonda
X

Nalgonda: ఓటర్ల సవరణలో నిర్లక్ష్యం వద్దు: కమిషనర్ దేవసేన

Nalgonda: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అందిన ఫారాలు, ధ్రువపత్రాల పరిశీలన అత్యంత కీలకమని, అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపులు, మార్పుచేర్పులను పూర్తి జాగ్రత్తతో పరిశీలించి చేపట్టాలని ఆదేశించారు.

​మంగళవారం నల్గొండ జిల్లా మునుగోడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 171వ పోలింగ్ కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బిఎల్ఓ పద్మతో ముఖాముఖి మాట్లాడి, సవరణ ప్రక్రియ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, జారీ చేసిన నోటీసులు, దస్త్రాల తనిఖీ, ఇంటింటి సర్వే విధానంపై ఆరా తీశారు.

​ఈ సందర్భంగా దేవసేన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో విఐపి ఓటర్ల పేర్లు తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఒకే ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉంటే, విచారణ జరిపి ఒకచోట కొనసాగేలా చూడాలే తప్ప రెండు చోట్లా తొలగించవద్దని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన ఓటర్లకు హియరింగ్ అనంతరం దరఖాస్తు ఆమోదం లేదా తిరస్కరణ వివరాలను తప్పక తెలియజేయాలన్నారు. నోటీసులు పొందిన ఓటర్లకు విచారణ పూర్తికాగానే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ సందర్భంగా వివరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda