Nalgonda: తిరుమలగిరి సాగర్ మండల వార్డ్ మెంబర్ల ఫోరం నూతన కమిటీ ఎన్నిక!
Nalgonda: నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల వార్డ్ మెంబర్ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామావత్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
Nalgonda: తిరుమలగిరి సాగర్ మండల వార్డ్ మెంబర్ల ఫోరం నూతన కమిటీ ఎన్నిక!
Nalgonda: నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల వార్డ్ మెంబర్ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కోఆర్డినేటర్ పోగుల నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.
నూతన కమిటీ సభ్యులు:
అధ్యక్షుడు: రామావత్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్: శాగం రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శులు: ఆంగోతు సర్దార్ నాయక్, తాడూరు రాజయ్య చారి, ఉపాధ్యక్షులు: దుగ్గే శివప్రసాద్, మెగావత్ శ్రీరాములు, సహాయ కార్యదర్శులు: చిట్యాల సాయి, ధనావత్ లక్ష్మి, యూత్ అధ్యక్షుడు: ఆంగోతు ముని నాయక్, మహిళా అధ్యక్షురాలు: కటికర్ల సౌందర్య. వార్డ్ మెంబర్ల హక్కులు, ఆత్మగౌరవం మరియు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని, ఫోరం నిరంతరం ముందుంటుందని ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి తెలిపారు.




