Nereducherla: నేరేడుచర్లలో చికెన్ సెంటర్ వాహనంలో నగదు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
Nereducherla: నేరేడుచర్లలో బొలెరో వాహనం నుండి నగదు బ్యాగ్ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 5 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Nereducherla: నేరేడుచర్లలో చికెన్ సెంటర్ వాహనంలో నగదు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
నేరేడుచర్ల: కోళ్లను దించుతున్న సమయంలో వాహనంలో ఉంచిన నగదు బ్యాగును చోరీ చేసిన వ్యక్తిని నేరేడుచర్ల పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో నేరేడుచర్ల పట్టణానికి చెందిన ధరావత్ సైదా తన చికెన్ సెంటర్‌కు సంబంధించిన బొలెరో వాహనాన్ని జానపాడు రోడ్డులోని గాంధీ చికెన్ సెంటర్ ఎదురుగా నిలిపి, డ్రైవర్, సిబ్బందితో కలిసి కోళ్లను దించుతున్నారు. ఈ క్రమంలో వాహనం క్యాబిన్‌లో రూ.7 వేల నగదుతో ఉన్న బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా నేరేడుచర్ల ఎస్ఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన చింతలచెరువు తిరుమయ్య (46), తండ్రి పిచ్చయ్య, ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
శనివారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి చోరీకి గురైన నగదులో రూ.5,000 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు హుజూర్‌నగర్ సీఐ జి. చరమంద రాజు తెలిపారు.




