Devarakonda: అంగన్వాడీ కార్యకర్తకు ₹20,000 ఆర్థిక సాయం అందించిన కిషన్ నాయక్!

Devarakonda: నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన బిఎల్ఓ అంగన్వాడీ కార్యకర్త ఎర్ర అలివేలు అనారోగ్యంతో బాధపడుతుండటంతో నేనావత్ కిషన్ నాయక్ రూ.20,000 ఆర్థిక సాయం అందించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 31 Oct 2026 1:39 PM IST
Devarakonda
X

Devarakonda: అంగన్వాడీ కార్యకర్తకు ₹20,000 ఆర్థిక సాయం అందించిన కిషన్ నాయక్!

Devarakonda: దేవరకొండ నియోజకవర్గం, గుడిపల్లి మండలానికి చెందిన BLO అంగన్వాడీ కార్యకర్త, ఎర్ర అలివేలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేనావత్ కిషన్ నాయక్ గారు మానవత్వంతో స్పందించి, వారి వైద్య ఖర్చుల నిమిత్తం ₹20,000/- (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అలివేలు కుమారుడు ఎర్ర కోటి గారికి అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ నాయక్ గారు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ఎర్ర అలివేలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుడిపల్లి సర్పంచ్ కూనరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, వార్డు మెంబర్లు కత్తు రమేష్, ఎర్ర వంశీ కృష్ణ, రామావత్ దామోదర్ నాయక్, ఎర్ర నరేందర్, శివ కుమార్, ఎర్ర సైదులు, ఎర్ర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA