Nalgonda: నల్లగొండ గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం!
Nalgonda: నల్లగొండ గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం. బెడ్లు లేక నేలపైనే రోగుల నరకయాతన. గాంధీకి పొమ్మంటూ ఉచిత సలహాలిస్తున్న డ్యూటీ డాక్టర్లు.
Nalgonda: నల్లగొండ గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం!
Nalgonda: పేదవాడికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా కేంద్రంలోని గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. అత్యవసర విభాగంలో బెడ్లు లేక రోగులు కటిక నేలపై, ఐరన్ బెడ్లపైనే నరకయాతన అనుభవిస్తున్నారు.
ఆపదలో వచ్చిన పేషెంట్లకు గంటల తరబడి వైద్యం అందించకుండా డ్యూటీ డాక్టర్లు కాలక్షేపం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల గ్రామాల నుంచి ఆశతో వచ్చే పేదలకు 'బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తాం.. గాంధీకి పొండి' అంటూ వైద్యులు ఉచిత సలహాలు ఇస్తూ చేతులెత్తేస్తున్నారు.ఆసుపత్రిలో దుస్థితిపై నిలదీసిన ఓ ప్రజాప్రతినిధినే డ్యూటీ వైద్యులు బెదిరించడం గమనార్హం. కెమెరాలు ఆన్ చేస్తే తప్ప నాడి పట్టని పరిస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి కార్పొరేషన్ స్థాయికి ఎదిగినా, నిరుపేదలకు ప్రాథమిక సౌకర్యాలు అందకపోవడం గమనార్హం.
వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని, ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి సర్కారు వైద్యాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.




