Devarakonda: గిరిజన గ్రామాల్లో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ పర్యటన!
Devarakonda: దేవరకొండ మండలంలోని గిరిజన గ్రామాల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించి, మైనింగ్ సమస్యలపై విచారణ జరిపి తక్షణమే పనులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
Devarakonda: గిరిజన గ్రామాల్లో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ పర్యటన!
Devarakonda: నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని గాజినగర్, కాసారం, వెంకటితండా, బొల్లిగుట్టతండాలలో గురువారం జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ పర్యటించారు. జిల్లాలో గిరిజన గ్రామాల సందర్శన గిరిజన ప్రజల సమస్యల సమీక్ష లో భాగంగా ఆయన పర్యటించి ప్రజల నుండి తెలుసుకున్న కరెంట్, భూముల, రోడ్, నీటి ఇతర సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే మైనింగ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న
కాచారం, బొల్లిగుట్ట, గాజీనగర్ ప్రజలు కమిషన్ మెంబర్ దృష్టికి తీసుకురాగా అధికారులకు మైనింగ్ సంబంధించిన గ్రామసభలో గ్రామస్థులు ఒప్పుకున్నట్లు తీర్మానం వీడియో చూపించాలని ఇన్ని రోజులు నడిపించినందుకు గ్రామంలోకి ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చారా అనేది అడిగి తెలుసుకున్నారు.
మైనింగ్ సంబంధిన పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? 5 రోజుల్లో సబ్మిట్ చేయాలని, అప్పటి వరకు మైనింగ్ ఆపాలని, మళ్ళీ మా నుంచి ఆదేశాలు వచ్చే వరకు పనులు జరప వద్దని, పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజన ప్రజలు మైనింగ్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలు విన్న జాటోతు హుస్సేన్ స్పందిస్తూ... గిరిజనుల సమస్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను కేంద్రానికి పంపుతామని, మైనింగ్ కంపెనీల తీరుపై జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, డి.ఎస్.పి తోపాటు మండల స్థాయి అధికారులు ఉన్నారు.




