Narketpally: నార్కట్‌పల్లిలో బంగారం రికవరీ వివాదం: ఎస్ఐపై వేటు
Narketpally: దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం రికవరీలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో నార్కట్‌పల్లి ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Narketpally: నార్కట్‌పల్లిలో బంగారం రికవరీ వివాదం: ఎస్ఐపై వేటు
Narketpally: నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ వివాదం కలకలం. దొంగతనం కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారంలో కొంత పక్కదారి పట్టించారనే ఆరోపణలు.
ఆరోపణల నేపథ్యంలో నార్కట్‌పల్లి ఎస్ఐపై వేటు. ఎస్ఐని జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు... ఈ వ్యవహారంలో మరో అధికారిపై కూడా ఆరోపణలు ఉన్నాయంటూ ప్రచారం.
అయితే సదరు అధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్ శాఖలో విమర్శలు. కీలక పోలీస్ అధికారితో సాన్నిహిత్యం కారణంగానే రక్షణ లభిస్తోందన్న ప్రచారం.
ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా? అన్నదానిపై ఉత్కంఠ. బంగారం రికవరీ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్.




