Nalgonda: మున్సిపల్ కార్మికురాలిపై దాడిని నిరసిస్తూ సీఐటీయూ ఆందోళన

Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై దాడిని నిరసిస్తూ నాంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో సీఐటీయూ ఆందోళన; నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 22 Nov 2026 9:56 PM IST
Nalgonda
X

Nalgonda: మున్సిపల్ కార్మికురాలిపై దాడిని నిరసిస్తూ సీఐటీయూ ఆందోళన

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న కార్మికురాలిపై దాడి చేయడం దారుణమన్నారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda