Yadadri: రామోజీ నాయక్ తండాలో గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు!
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తండాలో జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
Yadadri: రామోజీ నాయక్ తండాలో గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు!
Yadadri: తుర్కపల్లి (మ) రామోజీ నాయక్ తండాలో గిరిజనుల అభివృద్ధికి జాతీయ న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో తండాలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు. గిరిజన విద్యార్థులకు సైకిళ్లు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ. గిరిజనులకు కంటి అద్దాలు అందజేసిన హైకోర్టు జడ్జి,రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ పంచాక్షరీ ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అరవై రోజులలో గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు. రామోజీ నాయక్ తండా, దేవోజి నాయక్ తండాల్లో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభించిన అధికారులు. గిరిజన మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు. గిరిజనుల విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అరవై రోజుల కార్యక్రమాలు.




