Nalgonda: వచ్చే ఏడాది చివరికి నల్గొండ టీబీ రహితం: కలెక్టర్ చంద్రశేఖర్
Nalgonda: వచ్చే ఏడాది చివరి నాటికి నల్గొండ జిల్లాను సంపూర్ణ టీబీ రహితంగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
Nalgonda: వచ్చే ఏడాది చివరికి నల్గొండ టీబీ రహితం: కలెక్టర్ చంద్రశేఖర్
Nalgonda: వచ్చే ఏడాది చివరి నాటికి నల్గొండ జిల్లాను పూర్తి స్థాయిలో క్షయ (టీబీ) రహితంగా మార్చేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
గురువారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీబీ రహితంగా నిలిచిన 126 గ్రామాల సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో మరో 50 శాతం గ్రామాలను టీబీ రహితంగా ప్రకటించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరికరాలు, యాప్‌ల ద్వారా వ్యాధిని ముందస్తుగా గుర్తించాలని చెప్పారు.
అనుమానితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు జరిపించి, కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలన్నారు. క్షయ బాధితులకు పోషణ నిమిత్తం నెలకు రూ.1000 అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. అధునాతన వైద్యంతో టీబీని నయం చేయవచ్చని, ప్రజాప్రతినిధులు భాగస్వాములై వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఎంహెచ్ఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.




