Nalgonda: నల్లగొండలో దారుణం: తమిళనాడు కూలీ హత్య!

Nalgonda: నల్లగొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీ అపార్ట్‌మెంట్‌లో తమిళనాడు కూలీ దారుణ హత్య. డబ్బుల పంపకాల వివాదమే కారణమని పోలీసుల భావన.

Saleem, Nalgonda
Published on: 27 Sept 2026 7:49 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో దారుణం: తమిళనాడు కూలీ హత్య!

Nalgonda: నల్లగొండ పట్టణం పట్టణంలోని మీర్బాగ్ కాలనీ రోడ్ నంబర్ 6లో ఉన్న 'షా రెసిడెన్సీ' అపార్ట్‌మెంట్‌లో రాత్రి దారుణం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని రూమ్ నంబర్ 402లో తమిళనాడుకు చెందిన ఓ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రముఖ షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం తమిళనాడు (చెన్నై) నుంచి పలువురు కూలీలు వచ్చారు. వీరు మీర్బాగ్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కూలీ డబ్బుల పంపకం విషయంలో వీరి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాలై బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న డీఎస్పీ శివరామరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda