Nalgonda: ఎమ్మెల్యే వేముల వీరేశం క్షేమంగా ఉండాలని మృత్యుంజయ హోమం!

Nalgonda: ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేతేపల్లి బంగారు మైసమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.

PARAMESH, NALGONDA & SURYAPET
Updated on: 6 Nov 2026 2:44 PM IST
Nalgonda
X

Nalgonda: ఎమ్మెల్యే వేముల వీరేశం క్షేమంగా ఉండాలని మృత్యుంజయ హోమం!

Nalgonda: ​నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిన్న రెండు వేర్వేరు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడటంతో నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. దీనితో ఆయన ఆయురారోగ్యాలతో, పూర్తి క్షేమంగా ఉండాలని కోరుతూ కేతేపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ దంపతులు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ సమీపంలోని ప్రసిద్ధ బంగారు మైసమ్మ ఆలయంలో వీరు ప్రత్యేకంగా మృత్యుంజయ హోమం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు,అర్చనలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఈ సందర్భంగా దంపతులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్ కుమార్, కేతేపల్లి సర్పంచ్ లు బీరం జాన్ రెడ్డి, ఏర్పుల నాగరాజు,బొజ్జ సుందరయ్య,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నా అశోక్,గ్రామ శాఖ అధ్యక్షులు సైదిరెడ్డి,భయ్యా ముత్తయ్య,మాజీ సర్పంచ్ కోమాశెట్టి వెంకటరమణ,నాయకులు ఎర్రబోయిన సతీష్ , ప్రభాకర్ రెడ్డి ,వెంకట్ రమణ పరశురాములు అబ్బయ్య సాగర్ , బండమీది రవి సంపత్ శంకర్ రాంబాబుతో పాటు ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని హోమంలో ఆహుతులుర్పించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET