Nalgonda: నల్లగొండలో కలెక్టర్ వర్సెస్ ఎస్పీ క్రికెట్ మ్యాచ్
Nalgonda: నల్లగొండలో కలెక్టర్ ఎలెవన్, ఎస్పీ ఎలెవన్ మధ్య జరిగిన 12 ఓవర్ల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో ఎస్పీ ఎలెవన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Nalgonda: నల్లగొండలో కలెక్టర్ వర్సెస్ ఎస్పీ క్రికెట్ మ్యాచ్
నల్లగొండ: 12 ఓవర్ల పాటు సాగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో కలెక్టర్, ఎస్పీలు స్వయంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్పీ ఎలెవన్ నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన కలెక్టర్ ఎలెవన్ 107 పరుగులకే పరిమితమై రన్నరప్‌గా నిలిచింది.
విజేత ఎస్పీ జట్టుకు కలెక్టర్ ట్రోఫీ ప్రదానం చేశారు. మ్యాచ్‌లో ప్రతిభ చాటిన హరిబాబు (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్), శ్రీరామ్ (బెస్ట్ బ్యాట్స్‌మ్యాన్), ఇరుగు రవి (బెస్ట్ బౌలర్)లకు బహుమతులు అందజేశారు.




