Nalgonda: నల్లగొండ పోలీస్ గ్రీవెన్స్ డేలో 15 ఫిర్యాదులు ఎస్పీ శరత్ చంద్ర
Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్. బాధితుల నుంచి 15 ఫిర్యాదులు స్వీకరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశం.
Nalgonda: నల్లగొండ పోలీస్ గ్రీవెన్స్ డేలో 15 ఫిర్యాదులు ఎస్పీ శరత్ చంద్ర
నల్గొండ: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరిధిలో నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.




