Nalgonda: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్!
Nalgonda: డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక.
Nalgonda: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్!
Nalgonda: సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. నల్లగొండలోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ ఫ్లాష్ వాక్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ నేరగాళ్లు భయాందోళనలకు గురిచేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, ఎపికె (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం, తెలియని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం చేయవద్దని హెచ్చరించారు. నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడులు, బహుమతుల ఆశ చూపే ప్రకటనల పట్ల జగరూకతతో ఉండాలని, 'ఆగండి - ఆలోచించండి - నిర్ధారించుకోండి' (Pause - Think - Verify) అనే సూత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ సైబర్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని, ఎంత త్వరగా సమాచారం అందిస్తే పోయిన నగదును నిలిపివేసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.




