Nalgonda: నల్లగొండ: పోలీస్ గ్రీవెన్స్ డేలో 30 ఫిర్యాదుల స్వీకరణ
Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ 30 మంది బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు.
Nalgonda: నల్లగొండ: పోలీస్ గ్రీవెన్స్ డేలో 30 ఫిర్యాదుల స్వీకరణ
నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'గ్రీవెన్స్ డే'లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 30 మంది బాధితులు భూవివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలపై తమ వినతులను అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో నిర్లక్ష్యం తగదన్నారు.




