Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు!

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 26 Oct 2026 1:37 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు!

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి భారతీయ సంస్కృతి, సాహిత్య చరిత్రలో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయుడని పేర్కొన్నారు.

రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి అని కొనియాడారు. ఆయన రచించిన రామాయణం తరతరాలకు స్ఫూర్తినిస్తూ, సమాజానికి నైతిక విలువలను బోధిస్తోందని అన్నారు.మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, మనిషి తన జీవితంలో మంచి మార్పును స్వీకరించి ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చనే సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, క్రమశిక్షణ, నైతిక విలువలను పాటిస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహర్షి వాల్మీకి ఆశయాలను, బోధనలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,ఏ.ఓ శివ ప్రసాద్,ఏ. ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు,ఎస్బి సీఐ నాగరాజు, ఆర్.ఐలు సంతోష్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET