Nalgonda: ప్రజల కోసం పోరాడిన యోధుడు అంజయ్య: డేవిడ్!
Nalgonda: శాలిగౌరారం మండలం పెర్కా కొండారంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కామ్రేడ్ అరిగె అంజయ్య స్మారక స్తూపాన్ని పార్టీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్ కుమార్ ఆవిష్కరించారు.
Nalgonda: ప్రజల కోసం పోరాడిన యోధుడు అంజయ్య: డేవిడ్!
నల్గొండ: పీడిత ప్రజల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ అరిగె అంజయ్య అని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్ కుమార్ కొనియాడారు.
మండలంలోని పెర్కా కొండారం గ్రామంలో అంజయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్మించిన స్మారక స్తూపాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం అంజయ్య సతిమణి ముత్తమ్మ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.




