Nalgonda: పోలీస్ ఓపెన్ హౌస్ ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు
Nalgonda: నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు ఓపెన్ హౌస్. సైబర్ నేరాలు, ఆయుధాలు, డాగ్ స్క్వాడ్‌పై విద్యార్థులకు అవగాహన.
Nalgonda: పోలీస్ ఓపెన్ హౌస్ ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు
నల్గొండ: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు మిన్నంటి. వివిధ పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలను సందర్శించిన విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నేర పరిశోధన విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని వివరించారు.
బాంబ్ డిస్పోజల్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, ఐటీ సెల్, కమ్యూనికేషన్, డీసీఆర్‌బీ, స్పెషల్ బ్రాంచ్ విభాగాల విశిష్టతను తెలిపారు. డాగ్ స్క్వాడ్ జాగిలాలు నేరస్థులను పట్టుకోవడం, పేలుడు పదార్థాలను గుర్తించడంలో చూపే ప్రతిభను ప్రత్యక్షంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు.




