Nalgonda: మైనర్‌పై అత్యాచారం కేసు: నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన పోక్సో కోర్టు!

Nalgonda: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, 23 ఏళ్ల జైలు, జరిమానా విధించిన నల్గొండ పోక్సో కోర్టు. వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.

Saleem, Nalgonda
Published on: 17 Sept 2026 9:26 PM IST
Nalgonda
X

Nalgonda: మైనర్‌పై అత్యాచారం కేసు: నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన పోక్సో కోర్టు!

నల్గొండ: మైనర్‌ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన నేరస్థుడికి నల్గొండ పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 23 ఏళ్ల జైలు శిక్ష, రూ.3,000 జరిమానా విధించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాల ప్రకారం.. తిప్పర్తికి చెందిన షేక్ మహమ్మద్ ఖయ్యూం 2021లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో కోర్టు గతంలోనే 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

​బెయిల్‌పై బయటకొచ్చిన నిందితుడు 2023లో అదే బాలికను మళ్లీ అపహరించి దారుణానికి ఒడిగట్టాడు. పక్కా ఆధారాలతో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయగా.. నేరం రుజువు కావడంతో గురువారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీసు, కోర్టు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda