Nalgonda: పెద్దవూర గిరిజన గురుకులంలో రచ్చ: రోడ్డుపై విద్యార్థుల కొట్లాట!
Nalgonda: నల్లగొండ జిల్లా పెద్దవూర గిరిజన గురుకుల విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి పరస్పరం ఘర్షణ పడిన వీడియో వైరల్‌గా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Nalgonda: పెద్దవూర గిరిజన గురుకులంలో రచ్చ: రోడ్డుపై విద్యార్థుల కొట్లాట!
నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దవూరలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అర్ధరాత్రి వేళ విద్యార్థులు పాఠశాల దాటి రోడ్లపైకి వచ్చి పరస్పరం ఘర్షణ పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్, సిబ్బంది ఏం చేస్తున్నారని, రక్షణగా ఉండే సెక్యూరిటీ ఉండగానే విద్యార్థులు బయటకు ఎలా వచ్చారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




