Nalgonda: తాగునీటి కాలువలో ప్లాస్టిక్, చెత్తాచెదారం..పట్టణ ప్రజల ఆందోళన

Nalgonda: నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ కాలువ వ్యర్థాలతో పానగల్ రిజర్వాయర్ నీరు కలుషితం. తాగునీరు విషతుల్యమై రోగాలు ప్రబలుతున్నాయని నల్గొండ పట్టణ ప్రజల భయాందోళన.

Saleem, Nalgonda
Published on: 17 Sept 2026 1:04 PM IST
Nalgonda
X

Nalgonda: తాగునీటి కాలువలో ప్లాస్టిక్, చెత్తాచెదారం..పట్టణ ప్రజల ఆందోళన

Nalgonda: నల్గొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలువ ద్వారా పానగల్ రిజర్వాయర్‌లోకి వస్తున్న నీరు తీవ్రంగా కలుషితమవుతుండటంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో ప్లాస్టిక్, చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు యథేచ్ఛగా వేస్తుండటంతో జలాలు విషతుల్యంగా మారుతున్నాయి.

​ఈ పానగల్ రిజర్వాయర్ నుంచే పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా అవుతోంది. దుర్గంధభరిత నీరు సరఫరా కావడం వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలోని వ్యర్థాలను తొలగించి, కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda