Nalgonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో అశోక్ సార్ - కాంగ్రెస్, BRSపై విమర్శలు
Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు పాలకూరి అశోక్ ప్రకటించారు. కాంగ్రెస్, BRSలపై తీవ్ర విమర్శలు.
Nalgonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో అశోక్ సార్ - కాంగ్రెస్, BRSపై విమర్శలు
నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పాలకూరి అశోక్ ప్రకటించారు.నల్గొండలోని SBR గార్డెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల్లో తన వల్ల ప్రధాన పార్టీలకు చుక్కలు కనిపించాయని, 30 వేల మొదటి ప్రాధాన్యత, 90 వేల రెండో ప్రాధాన్యత ఓట్లతో BRS ఓటమికి కారణమయ్యానని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీలిచ్చి మోసం చేసిందని, 90% ఉన్న SC, ST, BCలను పక్కనపెట్టి రెండు సీట్లను ఒకే వర్గానికి కేటాయించి "రెడ్డి కాంగ్రెస్"గా మారిందని మండిపడ్డారు.పదిహేనేళ్లుగా నిరుద్యోగుల కోసం పోరాడి 18 కేసులు ఎదుర్కొన్నానని తెలిపారు.
తెలంగాణలో విద్యా, ఉద్యోగ రంగాలు ఇంకా ఆంధ్రుల కబ్జాలోనే ఉన్నాయని, "నాన్ లోకల్ గో బ్యాక్" నినాదంతో ఉద్యమిస్తానన్నారు.నిరుద్యోగులు, బీసీలు తనకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.




