Narketpally: చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయంలో కార్తీక ప్రత్యేక పూజలు!
Narketpally: కార్తీక మాసం సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తి కార్తీక దీపాలు వెలిగించారు.
Narketpally: చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయంలో కార్తీక ప్రత్యేక పూజలు!
నార్కట్ పల్లి: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై కార్తీక మాసం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు శివనామస్మరణతో ఆలయ ప్రాంతం మర్మోగుతుంది. గుట్టపై భక్తులు క్యూ లైన్ లో తెల్లవారుజాము నుండి బారులు తీరారు పూజలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ శ్రీశైలం గా వర్ధిల్లుతున్న చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం పై మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు మొక్కి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి అలయానికి అధిక సంఖ్యలో చేరుకొని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. స్వామికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.




