Nalgonda: రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ మాయం: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశంస!
Nalgonda: మిషన్ భగీరథ రక్షిత తాగునీటితో నాంపల్లి మండలం రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ పూర్తిగా తొలగిపోవడం అభినందనీయమని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ కొనియాడారు.
Nalgonda: రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ మాయం: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశంస!
నల్గొండ: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడంతో మారుమూల రామదాస్ తండా (నాంపల్లి మండలం)లో ఫ్లోరోసిస్ సమస్య పూర్తిగా తొలగిపోవడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య కొనియాడారు. బుధవారం ఆయన నాంపల్లి మండలంలోని రామదాస్ తండాను సందర్శించి, క్షేత్రస్థాయిలో నీటి సరఫరా తీరును పరిశీలించారు.
గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల అభిప్రాయాలు సేకరించారు. గతంలో బోరు నీటిని వాడటం వల్ల ఫ్లోరైడ్ బారినపడి తీవ్ర ఇబ్బందులు పడ్డామని, భగీరథ నీరు వచ్చాకే ఆ ముప్పు తప్పిందని గ్రామస్థులు, సర్పంచ్ మేఘావత్ చిట్టి శ్రీనివాస్ ఆయనకు వివరించారు. గడిచిన పదేళ్లలో కొత్తగా ఎలాంటి ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, తాగునీటి నమూనాలను పరీక్షించాల ని ఆదేశించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ నాగేశ్వరరావు, చండూరు ఆర్డీవో శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.




