Nakrekal: జల్సాల కోసం సీజ్డ్ బైకులు అమ్ముకున్న కానిస్టేబుల్!

Nakrekal: నకిరేకల్ పీఎస్‌లో సీజ్ చేసిన బైకులను జల్సాల కోసం అమ్ముకున్న కానిస్టేబుల్ సైదులు లీలలు వెలుగులోకి వచ్చాయి. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ముగ్గురిని విచారిస్తున్నారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 3 Nov 2026 7:56 PM IST
Nakrekal
X

Nakrekal: జల్సాల కోసం సీజ్డ్ బైకులు అమ్ముకున్న కానిస్టేబుల్!

నకిరేకల్: జిల్లా నల్గొండ నకిరేకల్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన మోటార్ సైకిల్ మాయం ఓ కానిస్టేబుల్ ఏకంగా కేసుల్లో ఉన్న సీజ్ చేసిన మోటార్ వెహికల్స్ ని తన జల్సాల కోసం అమ్ముకున్నాడు. కరోనా సమయంలో ఈ మోటార్ వెహికల్స్ ని అమ్ముకున్నట్లుగా సమాచారం. ఒక్కొక్క బైకు 5000 నుండి 15వేల రూపాయలకు తనకు తెలిసిన వ్యక్తులకు కానిస్టేబుల్ అమ్మినట్లు సమాచారం. ఆలస్యంగా ఆ కానిస్టేబుల్ లీలలు ఒకటొకటిగా వెలుగులోకి ఈ కానిస్టేబుల్ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ కేతేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.

వాహనాలను కొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు, మూడు మోటారు సైకిళ్లను రికవరీ చేసి బైకులు కొన్న వారిని ఎంక్వయిరీ చేస్తున్నట్లు సమాచారం, బైకులు అమ్ముకున్న కానిస్టేబుల్ సైదులు ప్రస్తుతం లో పరారీలో ఉన్నట్లు సమాచారం, కానిస్టేబుల్ సైదులు తన జల్సాల కోసం ఎన్ని సీజ్ చేసిన బైకులు అమ్ముకున్నాడు తెలియాల్సి ఉంది.

కానిస్టేబుల్ సైదులు నకిరేకల్ శాలిగౌరారం కేతేపల్లి కట్టంగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించాడు. ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని బైకులు అమ్ముకున్నాడు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సైదులు 2009 బ్యాచ్ కి చెందినవాడు. అంతకుముందు హోంగార్డుగా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో చాలా రోజులు విధులు నిర్వహించాడు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL