Nalgonda: బతుకమ్మ ఏర్పాట్లలో నల్లగొండ కార్పొరేషన్ అలసత్వం!
Nalgonda: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ వేడుకల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Nalgonda: బతుకమ్మ ఏర్పాట్లలో నల్లగొండ కార్పొరేషన్ అలసత్వం!
నల్గొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగ నిర్వహణలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం పరాకాష్ఠకు చేరింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలు కావడంతో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోగా, క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




