Nalgonda: జలదోపిడీపై ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం!
Nalgonda: పల్నాడు వాటర్ గ్రిడ్, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ సాగిస్తున్న జలదోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు.
Nalgonda: జలదోపిడీపై ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం!
నల్గొండ: పల్నాడు వాటర్ గ్రిడ్, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ సాగిస్తున్న జలదోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. ఎనిమిది నెలలుగా రహస్య నిర్మాణాలు జరుగుతున్నా ప్రభుత్వం గుర్తించలేదని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ విషయంపై తక్షణమే స్పందించాలని కోరారు. మరోవైపు వీర్లపాలెంలో ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి, పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం అమానుషమని మండిపడ్డారు. గిరిజన, దళిత ప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఇథనాల్ పరిశ్రమ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




