Nalgonda: చెరువుగట్టులో ₹95 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Nalgonda: నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో ₹95 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దర్శనం.
Nalgonda: చెరువుగట్టులో ₹95 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం , ప్రసిద్ధ పుణ్య క్షేత్రం చెర్వుగట్టు గుట్టపై మరియు గ్రామంలో మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో మొత్తం రూ.95 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ.15 లక్షలతో చేపట్టనున్న పైప్లైన్ పనులకు, అలాగే గుట్టపై రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బాత్రూం కాంప్లెక్స్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, చేర్వుగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




