Nalgonda: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!

Nalgonda: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని విప్ వేముల వీరేశం పిలుపు.

PARAMESH, NALGONDA & SURYAPET
Updated on: 19 Oct 2026 12:59 PM IST
Nalgonda
X

Nalgonda: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!

Nalgonda: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంతో నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ భేటీలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.అర్హులైన ప్రతి పట్టభద్రుడూ తప్పక ఓటరుగా నమోదయ్యేలా ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

SIR (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతూ తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పౌరుల ఓటు హక్కును పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాజీలేని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు.​

ఒకవైపు పట్టభద్రుల ఓట్ల నమోదును వేగవంతం చేస్తూనే, మరోవైపు SIR ప్రక్రియలోని అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కార్యకర్తలను ఆదేశించారు. "ఓటు హక్కు మన హక్కు – ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత!" అంటూ నినదించారు.​ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET