Miryalaguda: మిర్యాలగూడ సర్కారు దవాఖానాలో రాత్రివేళ మందుబాబుల హల్‌చల్!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారిందని, పారిశుధ్యం లోపించి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 9 Nov 2026 5:24 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడ సర్కారు దవాఖానాలో రాత్రివేళ మందుబాబుల హల్‌చల్!

మిర్యాలగూడ: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి.. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోందా..? అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య చికిత్స అందించాల్సిన ప్రాంగణం.. రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆసుపత్రిలో రోగుల కంటే మందుబాబులే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం సేవించడం ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు..మరోవైపు ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా లోపించిందని, సెక్యూరిటీ వ్యవస్థ కూడా సక్రమంగా లేదని రోగులు వాపోతున్నారు.

ఇంత జరుగుతున్నా సంబంధిత వైద్యాధికారులకు ఇవేమీ కనిపించడం లేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన కొందరు వైద్యాధికారులు.. తాము నిర్మించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారంటూ రోగులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను గాలికి వదిలేసి.. సమస్యలపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA