Miryalaguda: ఎల్‌నినో ప్రభావంపై 30న నియోజకవర్గ స్థాయి సమీక్ష!

Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో అక్టోబర్ 30న ఎల్‌నినో ఉపశమన కార్యాచరణ ప్రణాళికపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 29 Oct 2026 7:26 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఎల్‌నినో ప్రభావంపై 30న నియోజకవర్గ స్థాయి సమీక్ష!

మిర్యాలగూడ: మిర్యాలగూడ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్ నీనో ప్రభావం ఉపశమన కార్యాచరణ ప్రణాళికపై మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశం ఈ నెల 30న పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు మిర్యాలగూడ ఎంపిడిఓ ఎం.శేషగిరిశర్మ గురువారం తెలిపారు.

సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) జే.శ్రీనివాస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.ప్రేంకరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతి అధికారి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కిషోర్, విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్డబ్లుఎస్, నీటిపారుదల, ఆర్ అండ్ బి, ప్రజారోగ్య శాఖ, భూగర్భజలాల సూపరింటెండెంటింగ్ ఇంజనీర్లు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులు అన్ని శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, గ్రామ స్థాయి యంత్రాంగం పాల్గొంటారని తెలిపారు. సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA