Miryalaguda: ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: రవి నాయక్!

Miryalaguda: నల్లగొండలో నిర్వహించే ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, 15న జరిగే రెడ్ షర్ట్ కవాతుకు యువత తరలిరావాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ పిలుపునిచ్చారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Updated on: 29 Oct 2026 7:15 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: రవి నాయక్!

మిర్యాలగూడ: DYFI జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యోజన సంఘం డివైఎఫ్ఐ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఓఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడవత్ రవి నాయక్ మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ వీర తెలంగాణ సాయుధ పోరాటాల వారసత్వం ఉన్న నల్లగొండ ప్రాంతంలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు నిర్వహించడం గర్వకారణం అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతుంటే ఏఐకేఎస్ రైతు జాతీయ సంఘం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ 50 అంచుల ఛాతి అని విర్రవీగే నరేంద్ర మోడీ మెడలు వంచేటట్టు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేటట్టు ఏఐకేఎస్ జాతీయ సంఘం రైతుల పక్షాన పోరాటం చేసిందన్నారు కావున ఈ సంఘం మహాసభలు జయప్రదం కొరకు రైతులు వేలాది సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 15వ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభ రెడ్ షర్ట్ వాలంటరీ కవాతుకు వేలాది మంది యువకులు కవాతులో పాల్గొనాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలినో ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారైతంగానికి నిత్యావసర సరుకులు 12 రకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు రైతు మహాసభ జయప్రదం కొరకు రైతాంగం యువకులు మేధావులు నల్గొండ జిల్లాలో 15వ తారీఖు నాడు నిర్వహించే బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదా నాయక్ జిల్లా కమిటీ సభ్యులు జగన్ వీరన్న సంపత్ డివైఎఫ్ఐ నాయకులు ఆశీర్వాదం రవి నాయక్ సమీర్ కార్తీక్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA