Miryalaguda: బంగారు గడ్డలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ శ్రీకారం!
Miryalaguda: మిర్యాలగూడ పట్టణంలోని బంగారు గడ్డ 29వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) గురువారం ప్రారంభించారు.
Miryalaguda: బంగారు గడ్డలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ శ్రీకారం!
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని బంగారు గడ్డ 29వ వార్డులో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలకృష్ణ గారు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ గారు, 29వ వార్డు కౌన్సిలర్ జావీద్ గారు, ఇతర కౌన్సిలర్లు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వార్డులో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, రహదారులు మరియు ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.




