Nalgonda: సాగర్ నీటి తరలింపుపై రాజీ పడే ప్రసక్తే లేదు: కోమటిరెడ్డి!

Nalgonda: నాగార్జునసాగర్ నుంచి పల్నాడు ప్రాజెక్టుకు నీటి తరలింపు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, 1.38 టీఎంసీల జలదోపిడీని అడ్డుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda
Published on: 26 Nov 2026 3:06 PM IST
Nalgonda
X

Nalgonda: సాగర్ నీటి తరలింపుపై రాజీ పడే ప్రసక్తే లేదు: కోమటిరెడ్డి!

నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నుంచి పల్నాడు ప్రాజెక్టుకు నీటి తరలింపు విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఈ పనులను అడ్డుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

జల్ జీవన్ మిషన్ పేరుతో సాగర్ నుంచి 1.38 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నాన్ని 'జలదోపిడీ'గా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై భారాస (BRS) నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు మానుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని మంత్రి హితవు పలికారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda