Nalgonda: ఉపాధ్యాయుడు దూదిగామ వెంకటేశ్వర్లుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం!

Nalgonda: నిడమానూరు ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు దూదిగామ వెంకటేశ్వర్లుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం; మిత్రుల అభినందనలు.

Saleem, Nalgonda
Published on: 22 Sept 2026 7:41 PM IST
Nalgonda
X

Nalgonda: ఉపాధ్యాయుడు దూదిగామ వెంకటేశ్వర్లుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం!

నల్గొండ: నిడమానూరు మండలం MPPS పాఠశాల ఉపాధ్యాయుడు దూదిగామ వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యాబోధనలో విశేష సేవలు అందించిన వెంకటేశ్వర్లును మంత్రి ప్రశంసించారు.

అవార్డు గ్రహీత వెంకటేశ్వర్లుకు 1994-95 పదో తరగతి బ్యాచ్ మిత్రులు, నల్ల ఉదయ్ ప్రకాష్, యువరాజ్,అల్లి సుభాష్ యాదవ్, (20వ డివిజన్ కార్పొరేటర్) శంకర్ యాదవ్ ప్రవీణ్ అహ్మద్ అలీ, గౌస్ పాషా భారతిశోభారాణి దీపిక సుల్తానా సుజాత, షాహిన్ శ్రీను రజినీకాంత్ శివరాంజని వెంకటేష్ పుట్టపాక, అహ్మద్ తదితరులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda