Nalgonda: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు – మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
Nalgonda: నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, సాగు, తాగునీటి సరఫరాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు కోరారు.
Nalgonda: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు – మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
నల్గొండ: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నీటి సరఫరా అంశాలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
అలాగే, జిల్లాలో తాగు, సాగునీటి సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు.




