Nalgonda: ఎంజీయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Nalgonda: నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. నేత్రదానం ప్రాముఖ్యతను వివరించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్.

Saleem, Nalgonda
Published on: 24 Sept 2026 4:45 PM IST
Nalgonda
X

Nalgonda: ఎంజీయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Nalgonda: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు హరినాథ్ హాజరై నేత్రదానం అవయవ దానాల ప్రాధాన్యతపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానంతో మరొకరికి క్రొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చునని ఈ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొని సమాజాన్ని చైతన్య పరచాల్సిందిగా కోరారు. ఎన్ఎస్ఎస్ ద్వారా దేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాలను పరిశీలించి సేవ కార్యక్రమాలలో నిమగ్నం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా మారం వెంకటరమణారెడ్డి, పి ఓలు డా షరీఫ్, డా విజయ్ కుమార్, శ్రీనివాస్, రమేష్ నాయక్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda