Nalgonda: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎంజీయూ ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీ
Nalgonda: నల్గొండ ఎంజీయూలో ఘనంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎన్‌సీసీ క్యాడెట్ల నినాదం.
Nalgonda: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎంజీయూ ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీ
నల్గొండ: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ఎన్‌సీసీ క్యాడెట్లు కీలకపాత్ర పోషించాలని అధికారులు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా క్యాడెట్లు ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎన్‌సీసీ 31వ బెటాలియన్ అధికారులు కొమ్ము మల్లయ్య, శశిధర్ రావు, అధికారి మశ్చీందర్‌లు మాట్లాడుతూ... యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని స్పష్టం చేశారు.




