Nalgonda: పార్టీలకతీతంగా నల్లగొండ అభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య

Nalgonda: నల్లగొండలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మేయర్ బుర్రి చైతన్య తెలిపారు. రూ. 20 కోట్లతో 6 లైన్ల రోడ్డు పనులను ప్రారంభించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 30 Oct 2026 5:27 PM IST
Nalgonda
X

Nalgonda: పార్టీలకతీతంగా నల్లగొండ అభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య

నల్లగొండ: నల్లగొండలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు.రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు సాగర్ రోడ్డులోని వైయస్సార్ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు మూడున్నర కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.​

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, మంత్రి కోమటిరెడ్డి వెంటనే స్పందించి తన శాఖ నుండి రూ.20 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు.పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లతో పాటు బ్రహ్మంగారి గుట్ట, లతీప్ సాబ్ గుట్టలకు ఘాట్ రోడ్లు నిర్మిస్తూ నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.​

అనంతరం మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ..నల్లగొండలో రూ.2,000 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతుంటే, ఓర్వలేని ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏడాది వ్యవధిలోనే నల్లగొండ రూపురేఖలు మారిపోతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు గుండబోయిన వెంకన్న యాదవ్, మామిడి కార్తీక్, రేగట్ట లింగస్వామి గౌడ్, ఇటికాల శ్రీనివాస్, ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, వజ్జ రమేష్ యాదవ్, ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య, దీప్లా నాయక్, పిల్లి కృష్ణంరాజు, సట్టు శంకర్, జూలకంటి శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET