Marriguda: ప్రజాప్రతినిధుల ఇళ్లలో తాంత్రిక పూజల ఆరోపణలు!
Marriguda: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో క్షుద్ర పూజల కలకలం: ప్రజాప్రతినిధుల ఇళ్లలో తాంత్రిక పూజల ఆరోపణలు, గ్రామస్తుల్లో భయాందోళన.. అధికారులకు ఫిర్యాదు.
Marriguda: ప్రజాప్రతినిధుల ఇళ్లలో తాంత్రిక పూజల ఆరోపణలు!
నల్గొండ: గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఇండ్ల లో పరిసరాల్లో శుక్రవారం, మంగళవారం రోజుల్లో కొందరు వ్యక్తులు శివశక్తుల పేరుతో ప్రత్యేక పూజలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఈ పూజల కారణంగా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మహిళలు, వృద్ధులు, పిల్లల్లో భయభ్రాంతులు నెలకొంటున్నాయని వారు పేర్కొంటున్నారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా కార్యక్రమాలు నిర్వహిస్తే, వాటిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.




