Nalgonda: నీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా: రాంరెడ్డిపల్లి జీపీ!
Nalgonda: తాగునీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సంచలన ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Nalgonda: నీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా: రాంరెడ్డిపల్లి జీపీ!
నల్గొండ: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఊరిలో తాగునీటిని వృథా చేసే వారిపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది. తాగునీటిని రోడ్లపైకి వదిలి వృథా చేస్తే రూ.5 వేల ఫైన్ విధిస్తూ గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
భవిష్యత్‌లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ లపంగి నరసింహ స్పష్టం చేశారు.ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించి.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పొదుపుగా వాడుకోవాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.




