Nalgonda: జాతీయ ఉత్తమ సర్పంచిగా దేవరకొండ మండలం మైనంపల్లి సర్పంచ్ ఎంపిక!
Nalgonda: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్‌కు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు. 15న ఢిల్లీలో ప్రదానం చేయనున్నట్లు ప్రకటన.
Nalgonda: జాతీయ ఉత్తమ సర్పంచిగా దేవరకొండ మండలం మైనంపల్లి సర్పంచ్ ఎంపిక!
Nalgonda: జాతీయ ఉత్తమ సర్పంచిగా దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపికైనట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు రాధ కృష్ణ గారు తెలిపారు. ఈమేరకు గత సంవత్సరం కాలంగా గ్రామంలో పాఠశాల విద్య బలోపేతం. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన.
పలు సామాజిక అంశాలపై అధ్యయనం చేసి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 15 న ఢిల్లీలో రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలునాయక్ గారి కృషితో.మరియ ప్రజల భాగస్వామ్యం తో అభివృద్ధి చేసుకోగలిగామని తెలిపారు.తనకు ఈ అవకాశం రావటం సంతోషంగా ఉందని తెలిపారు.




