Nalgonda: ఉన్నత పదవుల్లోని నేతలు హుందాగా వ్యవహరించాలి: రాజగోపాల్‌రెడ్డి!

Nalgonda: ఉన్నత పదవుల్లోని ముఖ్య నేతలు హుందాగా వ్యవహరించాలని, అధికారం ఉందన్న అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హితవు పలికారు.

Saleem, Nalgonda
Published on: 20 Nov 2026 12:07 PM IST
Nalgonda
X

Nalgonda: ఉన్నత పదవుల్లోని నేతలు హుందాగా వ్యవహరించాలి: రాజగోపాల్‌రెడ్డి!

నల్గొండ: ఉన్నత పదవుల్లోని ముఖ్య నేతలు హుందాగా వ్యవహరించాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హితవు పలికారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడుతూ, ప్రజావసరాలను విస్మరించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర క్షమించవని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ధర్మంగా, నిజాయతీగా పాలన సాగించే సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ఞానాన్ని ఆ నేతలకు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda