Nalgonda: సెల్‌టవర్ ఆర్‌ఆర్‌యూల చోరీ ముఠా అరెస్ట్.. 9 మంది రిమాండ్
Nalgonda: నల్గొండలో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి సెల్‌టవర్ ఆర్‌ఆర్‌యూలను చోరీ చేస్తున్న 9 మంది అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Nalgonda: సెల్‌టవర్ ఆర్‌ఆర్‌యూల చోరీ ముఠా అరెస్ట్.. 9 మంది రిమాండ్
నల్గొండ: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేస్తూ, ఖరీదైన సెల్‌టవర్ రేడియో రిమోట్ యూనిట్లను (ఆర్‌ఆర్‌యూ) చోరీ చేస్తున్న 9 మంది అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
వీరిలో ముగ్గురు ఎయిర్‌టెల్ ఇంజినీర్లు, నలుగురు టెక్నీషియన్లు ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో 38 చోరీలకు పాల్పడి రూ.1.62 కోట్ల సొత్తును అపహరించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.15 లక్షల నగదు, 3 కార్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.




